కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటి రావడానికి కెసిఆర్‌ కృషి

స్మార్ట్‌ సిటి అభివృద్ధి పనులను పరిశీలించిన వినోద్‌

Vinod Kumar
Vinod Kumar

కరీంనగర్‌: తెలంగాణలోని కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటి హోదా రావడానికి కారణం సిఎం కెసిఆర్‌ చేసిన కృషి అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కొనియాడారు. దేశంలోని అనేక నగరాలను స్మార్ట్‌ సిటిలుగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కెసిఆర్‌ ఒత్తిడి వల్లే కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటిల జాబితాలో చేర్చిందని ఆయన తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం కింద విడుదలైన నిధులతో కరీంనగర్ లో అద్భుతమైన పార్క్ రూపొందిస్తున్నామని, ఇందులో ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంటుందని తెలిపారు. స్మార్ట్ సిటి పనులు వేగంగా జరుగుతున్నాయని, పనులన్నీ పూర్తయితే కరీంనగర్ సిటి ఎంతో అందంగా మారిపోతుందని వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/