టిఆర్‌ఎస్‌ పాపం ప్రజలకు శాపంగా మారింది

రేపు రోడ్డు పై నడవడానికి రేటు కడతారేమో

vijayashanthi
vijayashanthi

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి సిఎం కెసిఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ టిఆర్‌ఎస్‌ పభ్రుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. కెసిఆర్‌ చెప్పిన బంగారు తెలం గాణ అంటే ఇదేనేమో’ అని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె ఓ ప్రకటన పెట్టారు. ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపి టికెట్టు ధరలు పెంచారని, ఆ తర్వాత పాల ధరను పెంచారని, తాజాగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఓ వైపు దుబారా, మరోవైపు అప్పులతో చివరికి కెసిఆర్‌ దొరగారు ప్రభుత్వాన్ని నడపలేనని చేతులెత్తేసినా ఎత్తేయవచ్చునని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం దుబారా ఖర్చులను సామాన్యుడి నడ్డి విరిచి భర్తీ చేస్తున్నట్లుందని ధ్వజమెత్తారు. రేపు జనం రోడ్డు మీద నడిచినందుకు కూడా డబ్బులు వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/