యువతకు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం

Venkaiah Naidu
Venkaiah Naidu

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్‌ కళాశాల స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్యార్థులకు వివిధ అంశాలపై ఉపరాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు. పుస్తక పఠనంతో విజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఎక్కడికి వెళ్లినా మాతృభాషను, మాతృభూమిని మరచిపోవద్దన్నారు. స్వచ్ఛభారత్‌ అందరి బాధ్యత అన్నారు. గొప్ప కలలు కనండి.. వాటిని కష్టపడి సాధించుకోండి అని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/