తర్వలోనే వీసీల నియామకం ..గవర్నర్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గోశాల ఏర్పాటు

tamilisai soundararajan
tamilisai soundararajan

హైదరాబాద్‌: యూని ర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ, ఇతర అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగానే వీసీల నియామకం ఆలస్యమైందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ మాట్లాడారు. వర్సిటీల్లోని సమస్యలను పరిష్కరిస్తామని, భూములను కబ్జాల నుంచి ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. యూనివర్సిటీల బలోపేతానికి కోర్సులు, సిలబస్‌, భూకబ్జాలు, సమస్యలు, ప్లేస్‌మెంట్‌, బడ్జెట్‌, పరీక్షల విధానం, ఫలితాలు తదితర 40 అంశాలతో ప్రశ్నావళిని పంపి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. కాగా కరోనా నిర్వహించిన ఖకనెక్ట్‌ చాన్స్‌లర్‌’ కార్యక్రమానికి విద్యార్థులనుంచి భారీ స్పందన వచ్చిందని, విజేతలను ఎంపికచేసి జూన్‌ 2న బహుమతులు అందచేస్తామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గోశాల ఏర్పాటు చేస్తామన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/