వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

బెయిల్ మంజూరు చేయండి..ముంబయి హైకోర్టుకు న్యాయవాది విన్నపం

varavara-rao

హైదరాబాద్‌: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ కూడా రావడంతో ముంబయిలోని జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ముంబయి హైకోర్టును ఆయన తరపు లాయర్ సుదీప్ పస్బోలా కోరారు.

వరవరరావు ఆరోగ్యం చాలా విషమంగా ఉందని… మరికొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉందని కోర్టుకు సుదీప్ తెలిపారు. ఒకవేళ ఆయన చనిపోతే… కుటుంబసభ్యుల మధ్య ఆయన చనిపోయేలా చూడాలని విన్నవించారు. ఈ వయసులో విచారణను ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఏమాత్రం లేవని… ఈ విషయంలో ఎన్ఐఏకు కూడా భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. కరోనా కూడా సోకడంతో ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందని తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ… వరవరరావును చూసేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. కోవిడ్ బాధితులను ఎవరూ కలవకూడదని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/