అంబేద్కర్‌ విగ్రహం తొలగింపుకు నిరసనగా విహెచ్‌ దీక్ష

V hanumantarao
V hanumantarao, senior congress leader

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌, పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం తొలగించడంపై ఆయన నిరసన తెలుపుతూ గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఒక రోజు దీక్షకు విహెచ్‌ పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటును సియం కేసిఆర్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఎలక్షన్‌ కోడ్‌ నెపంతో అంబేద్కర్‌ విగ్రహాన్ని లాకప్‌లో పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇంత జరుగుతున్నా టిఆర్‌ఎస్‌లోని దళిత నేతలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని విహెచ్‌ డిమాండ్‌ చేశారు. కాగా విహెచ్‌ దీక్షకు కాంగ్రెస్‌ నేతలు కుంతియా, మాజీ ఎంపి హర్షకుమార్‌ సంఘీభావం తెలిపారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/