ఎమ్మెల్యె పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్‌కుమార్‌

Uttam Kumar
Uttam Kumar

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డి ఎమ్మెల్యె, ఎంపిగా గెలుపోందారు. అయితే తాను తన ఎమ్మెల్యె పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 3వ తేదీన ఆయన తన రాజీనామా లేఖ అందించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్‌ హుజుర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌ విజయాన్ని దక్కించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవి వదులుకోవాలని నిర్ణయించారు. ఉత్తమ్‌ రాజీనామా చేస్తే ఆరు నెలల్లోగా హుజుర్‌నగర్‌కు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/