వైఎస్‌ సేవలు చిరస్మరణీయం..ఉత్తమ్

పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

uttam kumar reddy
uttam kumar reddy

అమరావతి : నేడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి. ఈ సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ను మించిన జననేత ఇంకెవరూ లేరని కీర్తించారు. ఆయన తీసుకువచ్చిన పథకాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఆ పథకాలను అనుసరిస్తున్నారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలపై చెరగని ముద్ర వేయడం వైఎస్ కే సాధ్యమైందని కొనియాడారు. యువత, రైతులు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి ఉపకరించేలా ఆయన సేవలు చిరస్మరణీయం అని తెలిపారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/