టిఆర్‌ఎస్‌, బిజెపి మధ్య డూప్లికేట్‌ ఫైట్‌ నడుస్తుంది

Uttam Kumar
Uttam Kumar

హైదరాబాద్‌: టిపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈరోజు మీడియాతో చిట్‌ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. టిఆర్‌ఎస్‌, బిజెపి మధ్య డూప్లికేట్ ఫైట్ నడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు మతతత్వాన్ని ప్రోత్సహించరని పేర్కొన్నారు. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన వాహనచట్ట సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్లే బీజేపీ సంఖ్యాబలం పెరిగిందన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/