వ్యవసాయ బిల్లుల వెనుక అనేక కట్రలు

నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ సంస్థల కోసమే..ఉత్తమ్‌

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: మూడు వ్యవసాయ బిల్లులను పాస్ చేయించి బిజెపి రైతులకు అన్యాయం చేసిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..రైతులను సిఎం కెసిఆర్‌, ప్రధాని మోడి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వ్యవసాయ బిల్లు పై రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా కారణం చూపి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. అయితే సిఎం తో భేటీకి కరోనా అడ్డు రావడం లేదా అని ప్రశ్నించారు. గవర్నర్ ఒప్పుకోకపోయినా రాజ్ భవన్ గేటుకు వినతి పత్రం ఇస్తామన్నారు. పార్లమెంట్ లో ఏకపక్షంగా మూడు బిల్లులను అప్రజాస్వామికంగా బిజెపి పాస్ చేయించిందన్నారు.

వ్యవసాయ బిల్లుల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కురుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి అనుబంధ పార్టీలు వ్యతిరేకించినా బిజెపి పార్లమెంట్ లో బిల్లులను పాస్ చేయించిందన్నారు. రాజ్యసభ లో బిజెపి కి బలం లేకున్నా అప్రజాస్వామికంగా బిల్లులు ఆమోదించారని ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారిందని విమర్శించారు. బిల్లులో రైతులకు న్యాయం, లాభం చేసేలా ఎలాంటి హామీ లేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరేలా కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులు ఉన్నాయన్నారు. వ్యవసాయ బిల్లుల వెనుక అనేక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని పార్లమెంట్ బయట మాట్లాడిన మాటలు బిల్లులో లేవన్నారు. రైతులకు స్పష్టమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉండాలన్నారు. మూడు బిల్లుల్లో రైతులకు ధర భరోసా లేదన్నారు. ఈ బిల్లుల వల్ల రైతులకు కొత్తగా వచ్చే లాభం ఏమీలేదన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/