స్పీకర్‌ తీరుపై ఉత్తమ్‌ కుమార్‌ అగ్రహం

Uttam Kumar
Uttam Kumar

హైదరాబాద్‌: తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అపాయింట్‌మెంట్‌ కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కార్యాలయానికి ఫోన్‌ చేశారు. అయితే స్పీకర్‌ అందుబాటులో లేరన్న సిబ్బంది సమాచారంతో ఉత్తమ్‌ అసంతృప్తికి గురై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ రహస్యంగా ఎందుకు కలిశారు? స్పీకర్ ను కలిసేందుకు తమకు ఎందుకు సమయమివ్వడం లేదు? అంటూ ఉత్తమ్ నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా, సీఎల్పీ విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ మండిపడ్డారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/