మాఫియాకు, మీడియాకు మధ్య యుద్ధం!


మీడియాను శాసిస్తున్న అమ్రిష్‌పురి లాంటివ్యక్తి!
సంచలన వ్యాఖ్యలు చేసిన టివి9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌

ravi prakash
ravi prakash

హైదరాబాద్‌: టివి-9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ మంగళవారం నాడు అజ్ఞాతం వీడి సిసిఎస్‌ పోలీసుల ముందు హాజరయ్యాడు. ఐతే రెండో రోజు కూడా రవిప్రకాశ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణలో రవిప్రకాశ్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పగా, పోలీసులు అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి సమాధానాలు చెప్పగా, మరికొన్నింటిని దాటవేసే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే..విచారణ అనంతరం రవిప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో మీడియాను కబ్జా చేసేందుకు మాఫియా ప్రయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్‌ అన్ని టీవీలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన తెలిపారు. మీడియాను కబ్జా చేసేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇంతకీ ఆ అమ్రిష్‌పురి ఎవరు? లేదా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం రవిప్రకాశ్‌ చేస్తున్నారా? అనే అంశాలపై క్లారిటీ రావాల్సిఉంది.
మాఫియాకు, మీడియాకు మధ్య పోరాటం జరుగుతుంది. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి. దొంత పత్రాలతో భూములు లాక్కొన్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారు. మీడియా కబ్జాపై జర్నలిస్టులంతా పోరాడాలి అని రవిప్రకాశ్‌ పిలుపునిచ్చారు. ఐతే ఈ వ్యవహారంపై టివి 9 నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో వేచి చూడాలి మరి.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos