పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు అర్ధరాత్రి నుండి అమలు
కిలోమీటర్‌కు 20 పైసలు పెంపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెరిగిన కొత్త చార్జీలు మంగళవారం నుంచి అమలవుతు న్నాయని యాజమాన్యం పేర్కొంది. సమ్మె తరు వాత ఆర్టిసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే సమయంలో చార్జీలు పెంచుతున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచుతామని వెల్లడించారు. ఆర్టిసిలో బస్సు ఛార్జీలు మూడేళ్ల తరువాత తాజాగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఛార్జీల పెంపు సోమవారం అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లో ఉంటాయి. దాదాపు ఎనిమిదివారాల పాటు సాగిన తెలంగాణ ఆర్టిసి సమ్మె ముగిసిన తరువాత గత నెల 29 నుంచి విధుల్లో చేరారు.
ప్రస్తుత సవరించిన ఛార్జీల వివరముల పట్టిక
పల్లెవెలుగు కనీస చార్జి రూ.5 నుంచి రూ.10కు పెంపు
సెమీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులో కనీస చార్జ్జి రూ.10
సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస చార్జ్జి రూ.10
సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస చార్జి రూ.10
ఎక్స్‌ప్రెస్ కనీస చార్జి రూ.10 నుంచి రూ.15కు పెంపు
డీలక్స్ కనీస చార్జి రూ.15 నుంచి రూ.20 వరకు పెంపు
సూపర్ లగ్జరీలో కనీస చార్జ్జి రూ.25
రాజధాని, వజ్ర బస్సులో కనీస చార్జిరూ.35
గరుడ ఎసి, గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జిరూ.35
వెన్నెల ఎసి స్లీపర్‌లో కనీస చార్జి రూ.70
ఈ కొత్త ఛార్జీల వల్ల సంవత్సరానికి ఆర్టిసికి అదనంగా రూ.700 ఆదాయం సమకూరుతుందని అంచనా.
తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.com/