ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ మృతి

Khammam: ఖమ్మంలో శనివారం రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా  కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కంచన్బాగ్ లోని అపోలో హాస్పిటల్ లో మృతి చెందారు.  దీనితో డాక్టర్ కె.లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆవేదన చెందారు.  శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల బీజేపీ  రాష్ట్ర శాఖ తరపున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అని అన్నారు.  ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ధైర్యం కోల్పోవద్దని బీజేపీ విజ్ఞప్తి చేసింది.