మేడారం జాతరకు బస్సు చార్జీ వివరాలివీ

Sammakka Saralamma Jatara, medaram
Sammakka Saralamma Jatara, medaram

మేడారం: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి ఏటా ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. అయితే అక్కడికి వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కాగా ఇప్పుడు ప్రాంతాలవారీగా బస్సు చార్జీలను టిఎస్‌ఆర్‌టిసి వెల్లడించింది. బస్సు చార్జీ వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రూ.440, ఖాజీపేట్ నుంచి రూ.190, హన్మకొండ నుంచి రూ.190, వరంగల్ నుంచి రూ.190, పరకాల నుంచి రూ.190చిట్యాల నుంచి రూ.200, ఘణపురం(ము) నుంచి రూ.140, భూపాలపల్లి నుంచి రూ.180, కాటారం నుంచి రూ.210, కాళేశ్వరం నుంచి రూ.260,సిరోంచ నుంచి రూ.300, ఏటూర్ నాగారం నుంచి రూ.60, కొత్తగూడ నుంచి రూ.240, నర్సంపేట్ నుంచి రూ.190, మహబూబాబాద్ నుంచి రూ.270, తొర్రూర్ నుంచి రూ.280, వర్ధన్నపేట్ నుంచి రూ.230, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రూ.240, జనగామ నుంచి రూ.280 వసూలు చేస్తారు. కాగా ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/