తెలంగాణలో విజేత ఎవరో?

TS POLL
TS POLL

తెలంగాణలో విజేత ఎవరో?

మరికొద్ది గంటల్లో తేలనున్న ఉత్కంఠ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందో ఉత్కంఠ నెలకొంది.. ఏదెలా ఉన్నా మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.. అధికార తెరాస, ప్రతిపక్ష ప్రజాకూటమి రెండూ విజయం తమదంటే తమదేనంటూ ధీమాగా ఉన్నాయి.. ఓటరుదేవుడి కరుణ ఏపార్టీకి ఉండనుందో తెలియనుంది.. గ్రామీణ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ శాతం పెరగటంతో విజయం తమదే నంటూ గులాబీ దళం పేర్కొంటోంది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో మొత్తం 73.20శాతం పోలింగ్‌ నమోదైన విషయం తెలిసిందే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.95శాతం పోలింగ్‌ జరిగింది.. కాగా హైదరాబాద్‌జిల్లాలో కేవలం 48.89శాతం పోలింగ్‌ అత్యల్పంగా నమోదైంది..విశేషం ఏమిటంటే అత్యధికంగా మల్కాజ్‌గిరి బరిలో 42 మంది అభ్యర్థులు పోటీపడగా, అతి తక్కువగా బాన్సువాడలో 6మాత్రమే బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.. ప్రముఖ ప్రధాన పార్టీల నుంచి 515 మంది, స్వతంత్రులు, చిన్నపార్టీ లనుంచి 1,306 మంది ఉన్నారు..