తెలంగాణ పోలీసులకు జగ్గారెడ్డి హెచ్చరిక

Jagga Reddy
Jagga Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో మిలియన్‌ మార్చ్‌ ఎలా జరిగిందో ఆర్టీసీ జాక్‌ ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమం కూడా అలాగే జరుగుతుందని కాంగ్రెస్‌ ఎమ్మేల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు భయం సృష్టిస్తున్నారు. ప్రభుత్వానికి ఎదురు మాట్లాడిన పోలీసులు భయాందోళలకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీసు అధికారులు జాగ్రత్త వహించాలని, ఎల్లకాలం కెసిఆర్‌ కుటుంబమే అదికారంలో ఉండదని అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/