25న రెండో విడత గొర్రెల పంపిణీ

TS Minister Talasani
TS Minister Talasani

Hyderabad: ఈనెల 25వతేదీన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గొర్రెల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. కులవృత్తులకు చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గొల్ల, కురుమలకు 75శాతం రాయితీపై గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఒక యూనిట్ విలువ రూ.1.25లక్షలు ఉంటుందన్నారు. ఇందులో 75శాతం ప్రభుత్వ వాటా, 25శాతం లబ్దిదారుడి వాటా ఉంటుందన్నారు. మొదటి విడతలో 3,34,619 మందికి పంపిణీ చేశామన్నారు.