సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధం

షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై చర్చించాం

minister-talasani-srinivas-yadav
minister-talasani-meets-cine-producers

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖులతో తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావు సమావేశమై కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. అయితే సమావేశం ముగిసిన అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ..అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామని తెలిపారు. షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని చెప్పారు. సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యాతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఒకట్రెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయాలు జరుగుతాయి. సిఎంను కలుస్తామని సినీ పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది అన్ని మంత్రి తలసాని తెలిపారు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో చిరంజీవి కమిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు. మొత్తం 14 వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈసమావేశంలో అల్లు అరవింద్, దిల్‌ రాజు, సి.కల్యాణ్, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, కొరటాల శివతో పాటు పలువురు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/