హరితహారం గ్రీన్‌ ఛాలెంజ్‌

TS Minister Srinivas Goud
TS Minister Srinivas Goud

Hyderabad: హరితహారం గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మొక్కలు నాటారు. బాల్‌నగర్‌ డివిజన్‌ నర్సాపూర్‌ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావులు పాల్గొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే గ్రీన్‌ ఛాలెంజ్‌ చేశారు. హైదరాబాద్‌లో పచ్చదనం కోసం విధిగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.