విద్యాశాఖ అధికారులతో సమావేశం

TS Minister Sabita indra Reddy
TS Minister Sabita indra Reddy

Hyderabad: విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పని చేయాలన్నారు. విద్యాశాఖలో గతం, ప్రస్తుతం, భవిష్యత్తు విషయాలపై చర్చించాలని, విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించారు. డ్రాప్‌ ఔట్స్‌ తగ్గించడంపై దృష్టి పెట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.