ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు

TS Minister Sabita indra Reddy
TS Minister Sabita indra Reddy

Hyderabad: రాష్ట్రంలో ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఆమె మాట్లాడుతూ… 2017 డీఎస్సీలో మొత్తం 8,729 పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టగా.. ఇందులో ఉర్దూ మీడియం పోస్టులు 900 ఉన్నాయని తెలిపారు. అయితే 336 మంది మాత్రమే అర్హత సాధించారని, మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలు 1109 ఉన్నాయని తెలిపారు. 5,964 పోస్టుల భర్తీ చేపట్టగా, 4,418 మంది నియామకమైనట్లు తెలిపారు.