రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్‌ సమీక్ష

ఆస్తుల న‌మోదులో ద‌ళారుల‌ను న‌మ్మొద్దు..కెటిఆర్‌

minister-ktr

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ జీహెచ్ఎంపీ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి గ్రేట‌ర్ ప‌రిధిలోని రెవెన్యూ స‌మ‌స్య‌ల‌పై సమీక్ష నిర్వహించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి హాజ‌ర‌య్యారు. వివిధ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు, కాల‌నీ సంఘాల ప్ర‌తినిధుల‌తో మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి చ‌ర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో భూ వివాదాల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్కారించాల‌నే సంక‌ల్పంతో ప్ర‌భుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువచ్చింద‌ని స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు.. ఆస్తుల న‌మోదుకు సంబంధించి ద‌ళారుల‌ను న‌మ్మొద్దు.. ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్ద‌ని కెటిఆర్‌ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నాము అని కెటిఆర్‌ స్ప‌ష్టం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: