యురేనియం నిక్షేపాల కోసం అనుమతులు ఇవ్వలేదు

TS  Minister KTR
TS Minister KTR

Hyderabad: యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇవ్వబోదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. యురేనియం తవ్వకాలపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లా లంబాపూర్‌లో అన్వేషణ జరిగిందని, నాగర్‌కర్నూల్‌-అమ్రాబాద్‌ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం ఎలాంటి అన్వేషణ చేపట్టలేదన్నారు. యురేనియం నిక్షేపాలున్నా అనుమతులు ఇవ్వబోమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందన్నారు.