జగిత్యాల జిల్లాలో పూర్తిస్థాయిలో యూరియా

TS Minister Koppala Eswar
TS Minister Koppala Eswar

KarimNagar: ఎరువుల కృత్రిమ కొరత కావాలనే సృష్టించారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కరీంనగర్‌లో వ్యవసాయ శాఖపై మంత్రులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో ఉందన్నారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. కేంద్రం సరైన ప్లాన్‌ చేసుకోకపోవడమే ఆలస్యానికి కారణమన్నారు. 1300 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందన్నారు. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని విమర్శించారు.