హుజూర్‌నగర్ లో జగదీశ్‌రెడ్డి పర్యటన

TS Minister Jagadish Reddy
TS Minister Jagadish Reddy

Hujoor Nagar (Surayapet Dist.) : గ్రామాల అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అమలుపై పరిశీలిస్తున్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మట్టపల్లిలో ఉన్న నర్సరీని మంత్రి పరిశీలించారు. గ్రామ పంచాయితీ ల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రూపొందించిన కార్యక్రమమన్నారు. గ్రామాల అభివృద్ధి కి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలన్నారు.