అమ‌రుల త్యాగ ఫ‌లం వల్లే స్వరాష్ట్రం

TS Minister Indra karan Reddy
TS Minister Indra karan Reddy

Nirmal: తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల సహకారం, ఎంద‌రో అమ‌రుల త్యాగ ఫ‌లం వల్లే స్వరాష్ట్రం కల సాకారమైందన్నారు.. ఇదే స్ఫూర్తితో సీయం కేసీఆర్ సార‌ధ్యంలో బంగారు తెలంగాణ‌ను సాధించుకుందామ‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకలను పురస్కరించుకొని.. కలెక్ట‌ర్ కార్యాల‌యం సమీపంలో అమరవీరుల స్థూపానికి మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నివాళుల‌ర్పించారు. అమరవీరుల స్థూపం వ‌ద్ద‌ పుష్పగుచ్ఛం ఉంచారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రొఫెస‌ర్ జయశంకర్,కొండా లక్ష్మ‌ణ్ బాపూజీ విగ్రహాల‌కు పూలమాల వేసి నివాళులర్పించారు. క్యాంప్ కార్యాల‌యంలో జాతీయ ప‌త‌కాన్ని ఆవిష్క‌రించారు. అటు నుంచి పరేడ్‌గ్రౌండ్స్‌కు మంత్రి అల్లోల‌ బయల్దేరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయ‌న ప్రసంగించనున్నారు.