ఆర్టీసి రూట్ల పర్మిట్లపై స్టే పొడిగింపు

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసిలోని 5,100 రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రూట్ల పర్మిట్లపై మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సోమవారానికి పొడిగించింది. మంత్రిమండలి పర్మిట్లపై తీసుకున్న నిర్ణయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. కాగా మంత్రిమండలి నిర్ణయాన్ని దాచవలసిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించగా, ఏజి వివరణ ఇస్తూ జీవో జారీ అయిన తర్వాత కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటుల ఉంచుతామన్నారు. రూట్ల ప్రైవేటీకరణ వ్యవరహారంలో కేంద్రప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు ఆర్టీసి కార్మికులకు వేతనాలపై విచారణను ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/