ఆర్టీసి సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: ఆర్టీసి సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమస్య పరిష్కారానికై కమిటీ వేస్తామని పేర్కొంది. కాగా టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరికొంత మంది సమ్మె ఇల్లీగల్‌ అని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరికొంత మంది చర్చలకు పిలిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా కోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు నిర్ణయించింది. కాగా సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ ఆర్టీసి సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై జరిగిన విచారణ సందర్బంగా సమ్మె చట్ట విరుద్ధం అని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి అధికారాల గురించి ఆయన తన వాదనలు వినిపించారు. అనంతరం బుధవారంలోగా కమిటీ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి చెప్పవలసిందిగా అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/