దిశ కేసు విచారణపై హైకోర్టుకు ప్రభుత్వం లేఖ

దిశ కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలంటూ లేఖ

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: దిశ కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. హైకోర్టు స్పందన నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ దీనిపై కసరత్తును ప్రారంభించింది. ఈరోజు లేదా రేపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ త్వరితగతిన సాగనుంది. రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకావం ఉంటుంది.  ఇటీవల వరంగల్ లో ఓ బాలిక హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా… కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తై, తీర్పు వెలువడింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/