ఆర్టీసిపై అత్యున్నత కమిటీకి ప్రభుత్వం నిరాకరణ

తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: ఆర్టీసి సమ్మె రోజుకో మలుపు తిరుగుతుంది. సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రతిపాదించిన కమిటీని ప్రభుత్వం నిరాకరించింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావనే లేదని ప్రభుత్వం తెలిపింది. చర్చలతో పరిష్కరించుకోవాలని హైకోర్టు ఇంతకాలం చెప్పినా అది సాధ్యపడకపోవడంతో సమ్మె చట్టబద్ధతను తేలుస్తామని ధర్మాసనం పేర్కొంది. కాగా దీనిపై కమిటీ ఏర్పాటు చేసి వైఖరిని తెలపాలంటూ విచారణను నేటికి వాయిదా వేసింది. కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మెపై పునరాలోచన చేసి 24 గంటల్లో నిర్ణయం చెబుతామని వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/