ఏపీలో అగ్నిప్రమాదాలు..తెలంగాణ అప్రమత్తం

ktr
ktr

హైదరాబాద్: ఏపీలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు నేడు మంత్రి కేటీఆర్.. ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ జయేష్ రంజన్‌కి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తెలంగాణలోని అన్ని ఫ్యాక్టరీలతో పాటు మానిఫ్యాక్చరింగ్ యూనిట్లలో వారంలోగా ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ జరగాలని ఆదేశించారు. భద్రతా నిబంధనలు పాటించకపోతే ఆయా ఇండస్ట్రీల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/