ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం కల్చరల్ నైట్Telangana Formation Day celebrations in Australia
Telangana Formation Day celebrations in Australia


Australia:ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో (ఏటీఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ కల్చరల్ నైట్ రూపం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎర్మింగ్టన్ కమ్యూనిటీ సెంటర్లో ఏటీఫ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన తెలంగాణా కల్చరల్ నైట్ ఘనంగా జరిగింది. సిడ్నీ మెట్రో ప్రాంతం నుంచి ఎముకలు కొరికే చలిలో కూడా దాదాపుగా 800 వందలమందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ కల్చరల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక మంత్రి – హానరబుల్ జియోఫ్రే లీ టెరిటరీ విద్యాశాఖ మంత్రి; పారామాటా; ఎంపీ -హానరబుల్ జూలియా ఫిన్, పారామాటా; స్ట్రాత్ఫీల్డ్ ఎంపీ హానరబుల్ జోడి మక్కే; హాజరయ్యారు. తొలుత తెలంగాణ అమరులకు, జయశంకర్ సార్కు నివాళి అర్పించి తెలంగాణ ఆటా, పాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మారుమోగిపోయింది.

టెరిటరీ విద్యాశాఖ మంత్రి జియోఫ్రే లీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి తెలంగాణ ఒక మంచి ఉదాహారణ అని అన్నారు.

ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి; యాంకర్ రవి విశిష్ట అతిథులు గ పాల్గొని తమ ఆటా పాటలతో అలరించారు. పిల్లలు, పెద్దలు తమ ఆట పాటలతో అతిథులను  ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో సింగర్శ్రావణ భార్గవి ఆలపించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ నివసిస్తున్న తెలంగాణ వాదులలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తాజాగా కలిగించే లక్ష్యంతో ఈ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. సింగర్ శ్రావణ భార్గవి పాటలు పాడుతుంటే ఆహూతులు ఆనందం ఉరకలెత్తి నృత్యాలు చేశారు.