సమగ్ర విద్యుత్ విధానం అవసరo

TS CM KCR
TS CM KCR

Hyderabad: సమగ్ర విద్యుత్ విధానం దేశంలో రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజేశ్ శర్మను కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అన్ని రంగాలకూ అన్ని వేళల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కావాలన్నారు. ప్రస్తుతం స్థాపిత విద్యుత్ ఉత్పత్తిలో సగం కూడా వినియోగించడం లేదన్నారు. దేశంలో ఇంకా విద్యుత్ కోతలు అమలవుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరముందన్నారు.