జీహెచ్ఎంసీ చట్ట సవరణకు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఐదు సవరణలకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ శాసనసభ

Telangana Assembly passes amendments to GHMC Act

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఈరోజు జీహెచ్ఎంసీ చట్ట సవరణ కోసం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్బంగా చట్ట సవరణ బిల్లును మంత్రి కెటిఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించిన తర్వాత మొత్తం ఐదు సవరణలకు సభ ఆమోదం తెలిపింది.

సభ ఆమోదం తెలిపిన ఐదు సవరణలు ఇవే:

•జీహెచ్ఎంసీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
•జీహెచ్ఎంసీ పరిధిలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు ఆమోదం
•10 ఏళ్లకు ఒకసారి మాత్రమే రిజర్వేషన్ల మార్పు
•నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీలకు సభ ఆమోదం. ఈ కమిటీలలో యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజెన్ కమిటీ, ఎమినెంట్ సిటిజెన్ కమిటీలు ఉన్నాయి.
•ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదించాలనే సవరణకు ఆమోదం.

అసెంబ్లీలో జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ పోచారం తెలపారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/