సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద తృప్తి దేశాయ్ అరెస్ట్‌

దిశ ఘటనపై ఆందోళన.. కెసిఆర్‌పై విమర్శలు

Trupti Desai
Trupti Desai

హైదరాబాద్‌: శంషాబాద్‌ పరిధిలో జరిగిన దిశ ఘనపై భూమాతా బ్రిగేడ్‌ నాయకురాలు తృప్తి దేశాయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. వివాహ వేడుకులకు హాజరు అవడానికి ఉన్న సమయం దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఉండదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అని, తాను త్వరలోనే సిఎం కార్యాలయానికి వెళ్లి, ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తానని తృప్తి దేశాయ్ గతంలోనే తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆమె నేరుగా దిశ కుటుంబ సభ్యులను కలిసి, పరామర్శించడానికి వచ్చారు. అంతేకాకుండా తన మద్దతు దారులను తీసుకెళ్లి సిఎం కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తృప్తి దేశాయ్ డిమాండ్‌ చేశారు. దీంతో ఆమెను, ఆమెతోపాటు ఆందోళన చేపట్టిన తన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/