నేడు సిరిసిల్లలో పర్యటించనున్న కెటిఆర్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సోమవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మంత్రి కెటిఆర్‌ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన సిరిసిల్ల చేరుకుని, అక్కడి పొదుపు భవన్‌లో కలెక్టర్‌తో పాటు ఆయా అధికారులతో కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా సిరిసిల్ల అభివృద్ధిపై మంత్రి సమీక్షలో అధికారులతో చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగా నిర్మించిన తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/