ఎమ్మెల్సీ మూడు స్థానాల్లో టిఆర్‌ఎస్‌ విజయం

mahender reddy, chinnapa reddy, srinivasa reddy
mahender reddy, chinnapa reddy, srinivasa reddy

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ది వెంకట్రామిరెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో, నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్ధి లక్ష్మిపై టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి చిన్నపరెడ్డి గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ మూడు స్థానాలకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/