పార్టీ కార్యాలయాల నిర్మాణం దసరాకి పూర్తి చేయాలి

పార్టీ సమావేశంలో సియం కేసిఆర్‌

CM KCR
KCR, TS CM

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సియం కేసిఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని కేసిఆర్‌ పార్టీ నేతలకు నిర్ధేశించారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని టిఆర్‌ఎస్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక్కో భవనానికి రూ. 60 లక్షల చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను అందించారు. రాష్ట్ర వ్యాప్త సభ్యత్వ నమోదు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ కమిటీల ఏర్పాటు కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని దిశానిర్ధేశం చేశారు. పోడు భూముల వ్యవహారాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సియం దృష్టికి తెచ్చారు. పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. త్వరలో వీటన్నింటిని పరిష్కరిస్తామని సియం హామీ ఇచ్చారు.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/