రాష్ట్రంలో ప్రజా రంజక పాలన సాగుతుంది

Jagadeesh Reddy
Jagadeesh Reddy

నల్గొండ: టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల బాగు కోసమే టిఆర్‌ఎస్‌ పార్టీకి సిఎం పురుడు పోశారని ఆయన అన్నారు. నేడు ప్రజలంతా గులాబీ కండువాను భుజాన వేసుకొని మురిసిపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పేదరికాన్ని పోగొట్టి, సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని చెప్పుకొచ్చారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే మార్పు ప్రారంభమయ్యిందన్నారు. రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల సాగునీటి కలను సాకారం చేస్తున్నారనిమంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/