ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం

MP K Kavitha
MP K Kavitha

నిజామాబాద్‌: టిఆర్‌ఎస్‌ మాజీ ఎంపి కవిత ఇటివల మృతి చెందిన టిఆర్‌ఎస్‌ కార్యకర్త కిశోర్‌ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. కిశోర్‌ మరణం టిఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటని కవిత అన్నారు. కిషోర్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని కవిత అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. నిజామాబాద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అని ఆమె తెలిపారు.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/