టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం : కేసీఆర్‌

KCR
KCR

జగిత్యాల : సోమవారం జరిగిన ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్రం నలుమూలలు తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్క ,నియోజకవర్గంలో 50,60 మంది హాజరై పొజిటీవ్ వేవ్ కానబడుతోందన్నారు. మేనిఫెస్టోను వందశాతం టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిందన్నారు. ఎక్కువ స్థానల్లో గెలిచి, బంగారు తెలంగాణ చేసే దిశగా ప్రజలు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. 58 ఏళ్లపాటు పాలించిన పార్టీలు ఏకమయ్యాయని.. మహాకూటమిని ఉద్దేశించి కేసీఆర్‌ విమర్శించారు. చంద్రబాబును కాంగ్రెస్‌ వాళ్లు మోసుకొస్తున్నారని, వలసపాలకులు తెలంగాణకు అవసరమా?అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ కొనసాగుతున్న అభివృద్ధే టీఆర్ఎస్‌ను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలే గెలవాలని.. పార్టీలు కాదు అని ఆయన అన్నారు.