టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సర్పంచ్, వార్డుమెంబర్లు

పెద్దపల్లి : టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్, వార్డు మెంబర్లు టీఆర్ఎస్ లో చేరారు. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ స్వరూపరాజేశం,ఉప సర్పంచ్ మధుసూదన్ రావు, వార్డు మెంబర్లు రామారావు, తిరుపతి, పర్శరాములు, పృధ్వి, వేణుగోపాల్ రావుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.