వేణుమాధవ్‌ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

film and politicians tribute to Venu Madhav

Hyderabad: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్‌ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు మౌలాలీ స్మశానవాటికలో వేణుమాధవ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిలిం ఛాంబర్‌లో వేణుమాధవ్‌కు అభిమానులు నివాళులర్పిస్తున్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వేణుమాధవ్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మురళీమోహన్‌, ఇతర సినీ నటి, నటులు హాస్య నటుడికి అశ్రు నివాళులర్పించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/