రెవెన్యూ శాఖలో బదిలీలకు సిద్ధం

Telangana government
Telangana government

హైదరాబాద్‌: తెలంగాణ రెవెన్యూ శాఖలో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధుల్లో భాగంగా వేరే జిల్లాల నుండి జిల్లాలకు వచ్చిన అధికారులను వారి వారి జిల్లాలకు తిరిగి పంపేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఇందుకు సంబంధించి దస్త్రం కలెక్టర్ దగ్గరకు చేరినట్లు సమాచారం. త్వరలోనే దానికి ఆమోదముద్ర పడనున్నట్లు తెలుస్తున్నది.
ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అధికారుల బదిలీలు అనివార్యమని ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒకేచోట దీర్ఘకాలికంగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేయడం అనివార్యం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/