కాళేశ్వరం.. మరో అపూర్వ ఘట్టం నమోదు

Kaleshwaram Project
Kaleshwaram Project

హైదరాబాద్‌: ఎన్నో వ్యయప్రయాసల మధ్య తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అపూర్వ ఘట్టం నేరవేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోతల ట్రయల్‌ రన్‌ ను నిర్వహించారు. అయితే ఈ ట్రయల్‌ రన్‌ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. లక్షలాది ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో భారీస్థాయిలో ఇంజినీరింగ్‌ అద్భుతం అనే రీతిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌ కు నీటి ఎత్తిపోతల ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/