పోలీసులకు భారీ జరిమానా

Hyderabad Police
Hyderabad Police

హైదరాబాద్: ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే పోలీసులకు భారీ జరిమానా తప్పదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎస్. అనిల్ కుమార్ హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఆయన అంతర్గత ఉత్వర్వలు జారీ చేశారు. హోంగార్డు నుండి ఐపిఎస్ ల వరకు ఎవరైనా సరే విధుల్లో ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన సవరణ చట్టం 2019లోని సెక్షన్210తీ ప్రకారం రెండింతల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.2 వేల జరిమానా, కారులో వెళుతూ సీటు బెల్టు పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్‌లో ప్రయాణించినా, సిగ్నల్స్ జంప్ చేసిన వారికి భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి హైదరాబాద్ పోలీసుల ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించవద్దని అనిల్ కుమార్ సూచించారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/