సినీ నటుడు అలీకి మాతృ వియోగం

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైతున్ బీబీ

ali-mother
ali-mother

హైదరాబాద్‌: ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ తల్లి జైతున్ బీబీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. కాగా, జైతున్ బీబీ భౌతిక కాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేటి సాయంత్రం హైదరాబాద్ ‌లో జైతున్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా అలీకి కన్నతల్లిపై ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లిదండ్రులే కారణం అని ఎపుడు చెబుతూ ఉండేవారు. ఇప్పటికే అలీ తన తండ్రిపేరిట సామాజికి కార్యక్రమాలు చేస్తున్న చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/