ఆర్టీసి సమ్మెపై నేడు కీలక ప్రకటన?

ఆర్టీసి కార్మిక సంఘాలు మరోసారి సమావేశం

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసి సమ్మె చేపట్టి నేటికి దాదాపుగా నెలన్నర పైగా అవుతుంది. అయితే కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసి జేఏసి కోర్టు బాట పట్టగా, ఉన్నత న్యాయస్థానం లేబర్‌ కోర్టుకు విచారణను బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆర్టీసి కార్మిక సంఘాల ఐకాస నేతలు ఎంజిబిఎస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐకాస నేతలు హైకోర్టు తీర్పు, భవిష్యత్‌ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలస్తుంది. హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని ఆర్టీసి జేఏసి వేర్వేరుగా సమావేశం జరిపి కార్మికుల అభిప్రాయాలను సేకరించింది. వాటిపై చర్చలు జరిపిన అనంతరం ఎల్బీనగర్‌లో ఆర్టీసి జేఏసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. మెజారిటీ కార్మికులు సమ్మె కొనసాగింపుపై మొగ్గు చూపారని తెలిపారు. కార్మిక కోర్టు తీర్పును పరిశీలించాకే సమ్మె కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports