నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ

Fish Medicine
Fish Medicine


హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు, రేపు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ విషయమై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పలు సూచనలు చేశారు.